ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని మంగమూరు గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బీఎన్ విజరుకుమార్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు ,గ్రామ పార్టీ అధ్యక్షులు అబ్బూరి శ్రీనివాసరావు, నాయకులు నల్లూరి కృష్ణారావు అబ్బూరి నారాయణరావు, వలేటి రవి, పార్లమెంట్ ఎస్సీ సెల్ సెక్రటరీ రంపతోటి అంకారావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కంకణాల గోపికృష్ణ, కొండ సింగు రాజు, పరుసు బుజ్జి, శ్రీనివాసరావు, పుల్లయ్య, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనిగిరి: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శివనగర్ కాలనీలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది మంగళవారం తెల్లవారుజాము నుంచే లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి వార్డు అధ్యక్షులు రాచర్ల వెంకటనారాయణ, నాయకులు డాక్టర్ పచ్చవ చంద్రశేఖర్, ఈదర రవికుమార్, కనిగిరి మనోహర్‌రావు, కొబ్బరి బోండాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దర్శి: దర్శి నియోజకవర్గంలో ఎన్‌టిఆర్ భరోసా పెన్షన్లను టిడిపి దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మంగళవారం పంపిణీ చేశారు. దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం ఉల్లగళ్లు గ్రామంలో, దర్శి టౌన్‌లోని 16వ వార్డులో, దర్శి మండ లం చెరుకుంపాలెం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ముండ్లమూరు ఎంపిడిఓ జనార్దన్, దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఎంపిడిఓ కృష్ణమూర్తి, రెవెన్యూ, సచివాలయం సిబ్బంది, టిడిపి, జనసేన, బిజెపి, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హనుమంతునిపాడు: అవ్వ తాతలకు తెల్లవారు జామున నుంచే ఇండ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయడం ఎంతో ఆనందకరంగా ఉందని ఎంపీడీవో రంగు సుబ్బరాయుడు అన్నారు. మంగళవారం హనుమంతునిపాడు మండలం హాజీపురం, హనుమంతునిపాడు తదితర గ్రామాలలో పెన్షన్ పంపిణీ చేశారు. హనుమంతునిపాడు మండలం దొడ్డిచింతల గ్రామంలో సర్పంచి సానికొమ్ము బ్రహ్మారెడ్డి, నందన వనంలో పెంచికల రామకృష్ణ, తిమ్మారెడ్డిపల్లెలో కుందురు నారాయణరెడ్డి, నల్లగండ్లలో బలసాని కోటయ్య, హనుమంతుని పాడులో ఎంపీటీసీ ఉడుముల సుబ్బారెడ్డి, కత్తి కిషోర్, వాలిచర్లలో కూరాకు బాలనారాయణ, హాజీపురంలో గాయం రామిరెడ్డి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంపిణీ చేశారని తెలిపారు.