అక్టోబర్‌ 1 న ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ : జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : అక్టోబర్‌ నెల ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్‌ ల పంపిణీ జిల్లాలో 2,66,342 మందికి సుమారు రూ.112.71 కోట్లు పంపిణీ చేయనున్నట్లు, అక్టోబర్‌ 1వ మరియు 3వ తేదీలలో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్‌ డా. ఎస్‌. వెంకటేశ్వర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్యం వృద్ధాప్యం, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, హెచ్‌ఐవి వ్యాధి గ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు, డప్పు కళాకారులకు రూ.3,000 ల నుండి రూ.4,000 వరకు పెంచడమైనది. అలాగే వికలాంగుల పెన్షన్‌ లు రూ.3,000 ల నుండి రూ.6,000వరకు పెంచడమైనది. డి ఎం హెచ్‌ ఓ పెన్షన్‌ లు రూ.5,000 ల నుండి రూ.10,000 వరకు పెంచడమైనది. ఇందులో శాశ్వత వికలాంగులకు రూ.5,000 ల నుండి రూ.15,000 వరకు పెంచడమైనది. ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అక్టోబర్‌1 వ తేదీన ఉదయం.6 గం.ల నుండే లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి సచివాలయం సిబ్బంది పంపిణి చేస్తారని, అక్టోబర్‌ 1న మరియు 3వ తేదీలలో మాత్రమే పంపిణి చేస్తారని తెలిపారు. కావున పెన్షన్‌ లబ్ధిదారులు అందరూ అక్టోబర్‌1 వ తేదీననే తమ ఇంటి వద్ద అందుబాటులో ఉండి పెన్షన్‌ తీసుకోవాలని , బయట గ్రామాలకు వెళ్ళినవారు కూడా 1 వ తేదీన గ్రామాలలో వుండి పెన్షన్‌ తీసుకొనవలెనని కోరారు. ఏదేని కారణం చేతనైన 1వ తేదీన తీసుకోలేని వారు 3 వ తేదీన తప్పక అందుబాటులో ఉండి పెన్షన్‌ తీసుకోవాలని కోరారు. పెన్షన్‌ లబ్దిదారులు ఎవ్వరు సచివాలయ కార్యాలయానికి పెన్షన్‌ కొరకు రావలసిన అవసరం లేదని తిరుపతి జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

➡️