జి.కొండూరు (ఎన్టీఆర్ జిల్లా) : జి.కొండూరు జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్ధినీ, విద్యార్థులకు కొండేటి డిజిటల్ ఫోటో స్టూడియో వారి ఆధ్వర్యంలో కొండేటి శ్రీనివాసరావు, కొండేటి కొండలరావులు వారి తల్లిదండ్రులు కొండేటి నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మల జ్ఞాపకార్థం 250 భోజనం ప్లేట్లను శనివారం వితరణ గావించారు. మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కఅష్ణప్రసాదు గారు చేతుల మీదుగా వీటిని అందజేశారు. హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మధ్యాహ్న భోజనం చేసేందుకు విద్యార్థులకు వీటిని అందజేసినట్లు దాతలు వెల్లడించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారితో పాటు గ్రామ పెద్దలు, స్థానికులు, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు సిబ్బంది కొండేటి శ్రీనును ప్రత్యేకంగా అభినందించారు.
