రాయితీపై వరి విత్తనాల పంపిణీ

రాయితీపై వరి విత్తనాల పంపిణీ

ప్రజాశక్తి -అనంతగిరి : ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు రాయితీపై వరి విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి ఉమామహేశ్వరి తెలిపారు. ఈ మేరకు ముందస్తు ప్రణాళికతో ఆర్‌బికె కేంద్రాల్లో అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచామన్నారు. సోమవారం స్థానిక ఆర్‌బికె కేంద్రంలో రైతులకు రాయితీ విత్తనాలను ఎంపిపి శెట్టి నీలవేణి, స్థానిక సర్పంచ్‌ సొమ్మెల రూతు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎఒ మాట్లాడుతూ, గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీతో వరవిత్తనాలను అందజేస్తున్నామని, 30 కిలోల విత్తన బస్తా గిరిజన రైతులకు రాయితీపై రూ.120కే వస్తుందన్నారు. వరితోపాటు వేరుశనగ, చోడి, ఇతర విత్తనాలు రైతుభరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో బొర్రా సర్పంచ్‌ జన్ని. అప్పారావు, టిడిపి నాయకులు ఏం జోకులు సిబ్బంది తాతలు పాల్గొన్నారు

సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎంపిపి, సర్పంచ్‌

➡️