చీరలు పంపిణీ

ప్రజాశక్తి – చీరాల:  క్రైస్తవులు అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆనందంగా జరుపుకునే పండుగ క్రిస్మస్‌ పండుగ అని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. బుధవారం స్థానిక గడియారస్థంభం సెంటర్‌లో చీరాల నియోజకవర్గ పాస్టర్లు మరియు ఇవాం జిలిస్టు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యి మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్‌ పండగ వేడుకలను ప్రజలు జరుపుకోవాలని అన్నారు. క్రిస్మస్‌ వేడుకలు చీరాలలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకుం టుందన్నారు. క్రీస్తు చూపించిన శాంతి మార్గంలో పయనిస్తూ ప్రజల ఆదరాభిమానాలు గెల్చుకున్నాను అన్నారు. కొంత మంది అనేక విమర్శలు చేస్తూ ఆరోపణలు చేస్తున్నారని అలాంటి ఎంత ఎన్ని విమర్శలు చేసిన వాస్తవాలు ప్రజలకు తెలుసని ఇలాంటి వారికీ భయపడను అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నా ముందు ఉన్నాయని చీరాల అభివద్ధికి కషి చేస్తాన్నారు. ఈ సందర్బంగా క్యాండిల్‌ సర్వీస్‌ చేసి కేక్‌ కటింగ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో నియోజక వర్గం పరిశీలకులు నాతాని ఉమా మహేశ్వరరావు, పలువురు పాస్టర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️