రైతులకు సిల్వర్‌ వోక్‌ మొక్కల పంపిణీ

రైతులకు సిల్వర్‌ వోక్‌ మొక్కల పంపిణీ

ప్రజాశక్తి -హుకుంపేట: మండలంలోని దిగుడుపుట్టు గ్రామంలో ఆరుగురు, సంతరి పంచాయతీకి చెందిన 32 మంది గిరిజన రైతులకు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ గురువారం సిల్వర్‌వోక్‌ మొక్కలు పంపిణీ చేపట్టారు. ఈ సరదర్భంగా పిఒ మాట్లాడుతూ, సిల్వర్‌వోక్‌ మొక్కలను అంతర్‌ పంటగా వేసుకుని ఆర్థికాభివృద్ధి చెందాలని రైతులకు సూచించారు. మండలంలోని 38 రైతులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 26,600 మొక్కలు పంపిణీ చేశామన్నారు. సిల్వర్‌వోక్‌ మొక్కల పెంపకంలో భాగంగా పొలాల్లోని తుప్పలు తొలగించడం, దుక్కులు, గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, లైన్‌ అలైన్మెంట్‌, మొక్కల సంరక్షణకు లైఫ్‌ఫెన్సింగ్‌, ఎరువులు ఇలా మూడేళ్లపాటు ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ప్రోత్సాహకం అందుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో అరకు, పాడేరు ఎపిడిలు పవన్‌, శ్రీనివాస్‌, హుకుంపేట ఇఒపిఆర్‌డి, ఎపిఒ మూర్తి, రైతులు పాల్గొన్నారు.

సిల్వర్‌ మొక్కలు పంపిణీ చేస్తున్న ఐటిడిఎ పిఒ అభిషేక్‌

➡️