ప్రజాశక్తి-విజయనగరం కోట : ఉత్తమ ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఎంపికయ్యారు. బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ కింద ఈ పురస్కారం వరించింది. జిల్లా కలెక్టర్‌తోపాటుగా ఇదే కేటగిరీలో జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్, ఎపిఎస్‌పి 5వ బెటాలియన్ కమాండెంట్ మాలికా గార్గ్ కూడా ఈ పురస్కారాలను అందుకోనున్నారు. వీరితోపాటుగా జిల్లాకు సంబంధించి ఉత్తమ ఏఆర్‌ఓగా రాజాం తహశీల్దార్ ఎస్.కృష్ణంరాజు, ఉత్తమ బూత్‌లెవెల్ అధికారులుగా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఎం.హైమావతి, ఎం.శ్రీనివాసరావు కూడా ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరికి శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పురస్కారాల ప్రదానం జరుగుతుంది.
ఉత్తమ ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్
