ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్ సెప్టెంబరు 30 వ తేదీన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. సెప్టెంబరు 30 సోమవారం ”పి జి ఆర్ ఎస్ – మీ కోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో ”మీ కోసం” కార్యక్రమం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, వారి అర్జీలని క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండే డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయి అధికారులకి అందచేయాలని కోరారు. ఆర్జిదారులు వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కలెక్టరేట్ వద్ద కు రావద్దని కలెక్టరు ప్రశాంతి తెలియచేశారు. రెవిన్యూ డివిజనల్ అధికారులకి, మునిసిపల్ కమిషనర్లకు, తహసిల్దార్, ఎంపిడివో, ఇతర మండల స్థాయి అధికారులకి అందచేయాలని ఆ ప్రకటనలో తెలియచేశారు.