ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (రాయచోటి-అన్నమయ్య) : రెవిన్యూ అధికారులు తమ పనితీరు మెరుగుపరచుకొని శాఖ ప్రతిష్టను పెంచేందుకు బాధ్యతాయుతంగా కఅషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజంపేట నందలి కళాంజలి కళ్యాణమండపం వద్ద సబ్ కలెక్టర్ నైదియాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజంపేట డివిజన్ తహసీల్దార్లు, డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, మండల సర్వేయర్లు వీఆర్వో, వీఆర్‌ఏలతో రెవిన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా… ముఖ్యమంత్రి కార్యాలయం, సిసీఎల్‌ఏ కార్యాలయం మరియు పిజిఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారం, డివిజన్ లో ఫ్రీ హౌల్డ్ రిజిస్ట్రేషన్ల పరిశీలన, హైకోర్టు, ఆర్టిఐ, జాతీయ మానవ హక్కులు, లోకాయుక్త కమిషన్ కేసులు, అభివఅద్ధి కార్యక్రమాలలో భూసేకరణ, అలియనేషన్ ప్రతిపాదనలు, నాలా కేసులు, డివిజన్ స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తీర్మానాలు వాటి అమలు, ఓటరు జాబితా సవరణ తదితర అంశాలలో జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రెవిన్యూ సేవలలో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమన్నారు. పనితీరులో ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. ప్రజలతో కలిసి మెలిసి మమేకం కావాలని, చట్ట ప్రకారం మార్గదర్శకాలు మేరకు పని చేయాలని సూచించారు. ప్రజల వద్ద మంచి పేరు సంపాదించుకోవాలన్నారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దుకొని ముందుకు వెళ్లగలిగినప్పుడే శాఖకు మంచి పేరు వస్తుందని ఉద్బోధించారు. ఏలాంటి సమస్య అయినా కాలాతీతం చేయకుండా వేగంగా స్పందించి చట్టప్రకారం చర్యలు చేపట్టి నాణ్యతగా పరిష్కరించడమే మన ధ్యేయం కావాలని.. ఆ దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు.
పిజిఆర్‌ఎస్ ద్వారా అందిన దరఖాస్తులలో మొత్తం వచ్చిన దరఖాస్తులు ఎన్ని, పరిష్కరించినవి ఎన్ని, ప్రగతిలో ఉన్నవి ఎన్ని, పెండింగ్ లో ఎన్ని ఉన్నాయి, ఎస్‌ఎల్‌ఏ పరిధిలో ఉన్న దరఖాస్తులు, బియాండ్ ఎస్‌ఎల్‌ఏ దరఖాస్తుల పై సమీక్షించారు. రీఓపెన్ అయిన దరఖాస్తులకు సంబంధించి కారణాలు అడిగి తెలుసుకుని తగు సూచనలు జారీ చేశారు. పిజిఆర్‌ఎస్ అన్నది ముఖ్యమంత్రి గారికి అత్యంత ముఖ్యమైనదని, ప్రతి వారం పిజిఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం పై ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్ష చేస్తోందని, అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను నాణ్యతగా పరిష్కరించడమే మన బాధ్యత అని తెలియజేశారు. సీఎం ఓ కార్యాలయం నుంచి దరఖాస్తులు వచ్చినప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వేగంగా స్పందించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను పారదర్శకంగా విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకొని నాణ్యతగా సమస్యను పరిష్కరించాలన్నారు. తమ పరిధిలో దరఖాస్తులను మూడు రోజుల్లో పరిష్కరించాలన్నారు. నోటీస్ ఇవ్వాల్సి వస్తే 15 రోజులు, ఒకవేళ పై స్థాయిలో జేసీ మరియు కలెక్టర్ స్థాయికి వెళ్లాల్సి ఉంటే మొత్తంగా నెల రోజుల లోపల ఆ సమస్యను పరిష్కరించేందుకు తహసిల్దార్లు కఅషి చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. భూముల అంశంలో నిబంధనలను దఅష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేసి చట్ట ప్రకారం పరిష్కరించాలని తెలిపారు.
రాజంపేట డివిజన్ లో ఫ్రీ హౌల్డ్ రిజిస్ట్రేషన్ భూముల పరిశీలనను సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో బాగా నిర్వహించారని.. ఇందుకు సబ్ కలెక్టరును, తాసిల్దారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ముటేషన్ కరెక్షన్స్, మీసేవ అంశాల్లో కూడా రాజంపేట డివిజన్ ప్రగతి బాగుందని ప్రశంసించారు. ఇలాగే ప్రతి అంశంలో కూడా పనితీరును మెరుగుపరచుకొని డివిజన్ ను అభివఅద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కోర్టు కేసులు లోకాయుక్త మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత వ్యవధిలో కౌంటర్లు ఫైల్ చేయాలని, క్రైమ్ కేసులపై ప్రత్యేక దఅష్టి పెట్టి నిర్ణీత కాలపరిమితి లోగా కౌంటర్లు సబ్మిట్ చేయాలని కోరారు. నాలా కేసులను, డివిజన్ పరిధిలో భూ అభివఅద్ధి పనుల భూసేకరణ, అలియనేషన్ అంశాలను సమీక్షించి తగు సూచనలు చేశారు. రాజంపేట మున్సిపాలిటీలో మురుగునీటి శుద్ధి కార్యక్రమం నిమిత్తం భూ సేకరణ అంశంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ప్రతి నెల సివిల్ రైట్స్ డే తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. మండల సర్వేయర్లు ప్రైవేట్ భూములలో సర్వే కొరకు ఏదైనా దరఖాస్తు రాగానే… సంబంధితులతో ఎఫ్ లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించిన పిదప నిర్ణీత కాలంలోగా సర్వే పూర్తి చేయాలని సూచించారు. బదిలీ అయిన వీఆర్వోలను వెంటనే (నేడే) రిలీవ్ చేయాలని తహసిల్దారులకు సూచించారు. బదిలీ అయిన ప్రదేశంలో విఆర్వోలు విధుల్లో చేరాలని, విధుల్లో చేరని వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ… ఆయా అంశాల్లో తహసిల్దార్లు తమ పరిధిలో సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా కఅషి చేయాలన్నారు. వారి పరిధిలో లేని అంశాలను ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం సర్కులర్ జారీ చేసిందని… ఈ మేరకు నిబంధనలను అవగాహన కల్పించుకొని మండల వారీగా పారదర్శకంగా విచారణ చేసి… సిఎస్డిటి, డీఎస్‌ఓ లతో సంప్రదించి రేషన్ కార్డులు జారీ చేయాల్సిన జాబితాను రూపొందించాలని పేర్కొన్నారు. సమావేశంలో రాజంపేట సబ్ కలెక్టర్ నైదియాదేవి, సర్వే శాఖ జిల్లా అధికారి భరత్ కుమార్, డీఎస్‌ఓ, తహసిల్దార్లు, డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, మండల సర్వేయర్లు, వీఆర్వో, వీఆర్‌ఏలు, కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.