తిరుమల తొక్కిసలాట – క్షతగాత్రులకు జిల్లా కలెక్టర్‌ పరామర్శ

తిరుపతి సిటీ : తిరుమల తొక్కిసలాట ఘటనలో … క్షతగాత్రులు స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌ పరామర్శించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందినవారికి తిరుమల దర్శనానికి వీలుగా జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మౌర్య అన్ని ఏర్పాట్లు చేశారు. వారంతా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ తమ స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. వారికి అన్ని ఏర్పాట్లు చేసి, దగ్గరుండి అధికారులు సాగనంపారు.

➡️