రూ.99.90 కోట్లతో జిల్లా కలెక్టరేట్‌ మంజూరు : కలెక్టర్‌

Feb 13,2024 14:36 #Manyam District

ప్రజాశక్తి-పార్వతీపురం(మన్యం) : పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ నిర్మాణానికి రూ.99.90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జి.ఓ ఆర్‌.టి 65 ఉత్తర్వులను ఈ నెల 8వ తేదీన విడుదల చేసిందన్నారు. సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సముదాయం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు. అడ్డాపుశిల వద్ద భూమిని ఎంపిక చేశామని, 59.80 ఎకరాల భూమిని కేటాయించామని చెప్పారు. భవన నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమై, వేగవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

➡️