ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట మండలంలోని లింగంగుంట్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మంగళవారం పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ. మురళి, ఎంపిడిఓ టివి కఅష్ణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.