ప్రజాశక్తి – బైరెడ్డిపల్లి (చిత్తూరు) : ప్రజల సమస్యల పరిష్కారంకొరకు మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సిపిఎం జిల్లా నాయకురాలు భువనేశ్వరి సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరు 8 నుండి 14 నిర్వహించాము. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలు చెబుతున్న సమస్యలను గుర్తించి వాటిని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం. మీ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మండల పరిధిలో ఉన్న సమస్యలను జిల్లా అధికారులకు తెలియజేయాలని కోరుతున్నా అని ఆమె అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కొరకు జిల్లా సిపిఎం నాయకురాలు భువనేశ్వరి కెవిపిఎస్ ఈశ్వర్, సిపిఎం కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం కొరకు జిల్లా సిపిఎం నాయకురాలు భువనేశ్వరి అధికారులకు వినతి
