ప్రజాశక్తి-సంతనూతలపాడు: రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో పాల్గొనే జిల్లా సీనియర్ మహిళా జట్టు ఎంపిక బుధవారం మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. జిల్లా హాకీ అసోసి యేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ ఎంపిక ప్రక్రియను జిల్లా కార్యదర్శి ఏ.సుందరరామిరెడ్డి ఆధ్వర్యంలో టి.రవికుమార్ పర్యవేక్షించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనంపాడు డైట్ ప్రిన్సిపాల్ సామ సుబ్బారావు, చీమకుర్తి ఎంఈవో డీవిఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైట్ లెక్చరర్ ఆర్.శ్రీనివాసరావు, సిహెచ్.వెంకటేశ్వర్లు పీడీ కె.వనజ, హకీ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ తిరుమలశెట్టి రవికుమార్ పాల్గొన్నారు.
