ప్రజాశక్తి-పాణ్యం (నంద్యాల) : మండలం లోని మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ ప్రసన్న లక్ష్మి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె ఐ ఎల్ ఆర్ డీప్రిజ్ ను, అడల్ట్ బిసిజీ వ్యాక్సిన్ ను, ఫార్మసీ గదిని, లాగ్ బుక్ పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. వ్యాక్సిన్ వేసేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ సూపర్వైజర్ మరియు ఫార్మసీ అసిస్టెంట్, ఏ ఎన్ ఎం లు పాల్గొన్నారు.