జిల్లా పంచాయితీ కార్యదర్శులు నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : శనివారం ఎపి ఎన్జీవో హౌమ్‌ లో జరిగిన గ్రేడ్‌ 1 నుండి గ్రేడ్‌ 6 వరకు వున్న విజయనగరం జిల్లా పంచాయతీ కార్యదర్శులు సమావేశం ఏర్పాటు చేసుకుని నూతన తాత్కాలిక కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా – వై రమణ, కార్యదర్శి గా – పి పార్ధసారధి రావు , అసోసియేటు అధ్యక్షులుగా జి. రఘుబాబు, కోశాధికారిగా టి వెంకటరావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి లు గా – సి హెచ్‌ .సంతోష్‌ కుమార్‌, ఉపాధ్యక్షులుగా ఎమ్‌. జగదీష్‌ జి కఅష్ణ, జి నారాయణ రావు, జాయింట్‌ సెక్రటరీ లు గా సి హెచ్‌ ఏ ఎస్‌ ప్రసాద్‌, జాయింటు సెక్రటరీ మహిళ-ఆర్‌ శివ కుమారి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ గా రమణమ్మ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎపి ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షు లు డి. వి రమణ మరియు జిల్లా కార్యదర్శి ఏ. సురేష్‌,విజయనగరం పట్టణ అధ్యక్షులు వై ఆనంద్‌ కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్‌ తవుడు పాల్గొన్నారు.

➡️