ప్రజాశక్తి- కడప అర్బన్ గురుకుల్ విద్యాపీఠ్‌లో.. దీపావళి సంబరాలు ఘనంగా నిర్వ హించారు. అమ్మవారి విగ్రహానికి విద్యార్థులు పూజలు చేశారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో చైర్మన్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ వీరా కుమారి, సిఇఒ ఎ.ఎల్ వివేకానంద, హెడ్మాస్టర్ మునిచంద్ర, వైస్ ప్రిన్సిపల్ నరసింహులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాయిబాబా విద్యాసంస్థల్లో.. నగరంలోని సాయిబాబా విద్యాసంస్థల్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగ చేసుకుంటారని పేర్కొన్నారు. పాఠశాల సిఇఒ ఎం. వి. శ్రీదేవి మాట్లాడుతూ దీపావళి అనే పదం సంస్కతం నుంచి వచ్చిందని తెలిపారు. వైస్ చైర్మన్ ఎం.వి.సాయి సుధీర్ కుమార్ రెడ్డి వ దీపావళి శుభాకాంక్షలు విద్యార్థులకు తెలియజేశారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పాఠశాల ఆవరణంలో బాణాసంచా కాల్చారు. ఎస్‌వి ఇంజినీరింగ్ కళాశాలలో.. స్థానిక బాలాజీ నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ముందస్తు దీపావళి సంబరాలు నిర్వ హి ంచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వీర సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాలుష్య రహిత దీపావళి నిర్వహించుకొని పర్యావరణ సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ముగ్గులు, దియా మేకింగ్ పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపిస్తూ విద్యా ర్థులం దరూ కార్యక్రమంలో పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. కార్యక్ర మంలో విద్యార్థులు అధిపతులు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.