ప్రజాశక్తి – నాగులుప్పలపాడు : నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు కార్యదర్శి పనితీరుపై ఆ గ్రామపంచాయతీ సర్పంచి దేవరకొండ జయమ్మ జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా డిపిఒ ఆదేశాల మేరకు డిఎల్‌పిఒ పద్మావతి బధవారం విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి పనితీరుపై సర్పంచి, కార్యదర్శి సమన్వయం లోపాలపై విచారణ చేపట్టారు. సర్పంచి, కార్యదర్శి తమ వాదనలు వినిపించారు అనంతరం గత 8 నెలల క్రితం అప్పటి ఇన్‌ఛార్జి కార్యదర్శిగా శ్రీరామ్మూర్తి అవినీతికి పాల్పడ్డారని సర్పంచి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో డిఎల్‌పిఒ పద్మావతి విచారణ చేపట్టి రూ. 42లక్షల మేర అవినీతి జరిగినట్లు డిపిఒకు నివేదిక అందజేశారు. బాధ్యులపై చర్యలు తీసుకొని రికవరీ చేయకుండా మళ్లీ విచారణ ఏమిటని ప్రజలు చర్చించు కున్నారు.
