పిహెచ్‌సిలో డిఎంహెచ్‌ఒ తనిఖీ

Jun 11,2024 18:52
పిహెచ్‌సిలో డిఎంహెచ్‌ఒ తనిఖీ

తనిఖీ చేస్తున్న దృశ్యం
పిహెచ్‌సిలో డిఎంహెచ్‌ఒ తనిఖీ
ప్రజాశక్తి-నెల్లూరుఇందుకూరుపేట మండలం జగదేవి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెంచలయ్య గారు సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. మంగళవారం పిహెచ్‌సి సందర్శనలో భాగంగా సేఫ్‌ డెలివరీ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ నెలలో డెలివరీ కావలసిన గర్భవతులుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అదే విధంగా పిహెచ్‌సిలో కాన్పు జరిగిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పిహెచ్‌సిలో సేవలు ఏ తరహాలో ఉన్నాయో అడిగి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆషా డే సందర్భంగా వైద్య సిబ్బంది ఆశావాలంటీర్లతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేకించి సీజనల్‌ వ్యాధులు, అడల్ట్‌ బి సి జి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పిహెచ్‌సి పరిధిలో ఏ తల్లి ఏ బిడ్డ చనిపోకుండా గర్భవతులను పూర్తిస్థాయిలో ఫాలోఅప్‌ చేయాలని మాత మరణాలు శిశు మరణాలు జరగకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. గర్భవతులను 12 వారాల్లోపు గుర్తించడంతో పాటు, ఆరోగ్య పరీక్షలు ఎప్పటికప్పడు నిర్వహించుకొనే విధంగా చైతన్యం కల్పించాలన్నారు. హై రిస్క్‌ ప్రెగెన్సీ కేసులను గుర్తించడంతోపాటు, హై రిస్క్‌ కేసులకు ట్రాన్స్పోర్ట్‌ ఫెసిలిటీ పై కూడా దష్టి సాదించాలన్నారు. వంద శాతం ఏఎన్సి రిజిస్ట్రేషన్స్‌ జరగాలని సిబ్బందికి సూచించారు. స్పెషల్‌ న్యూ బోర్న్‌ కేర్‌ యూనిట్‌, న్యూ బోర్న్‌ స్టెబిలైజేషన్‌ యూనిట్‌ గురించి అవగాహన కలిగి ఉండాలని అవసరమైతే ఆ కేంద్రాలకు తరలించాలన్నారు. బిడ్డను ఐదు సంవత్సరాల వరకు తల్లి రక్షణలో ఉండాలని, కమ్యూనికేబుల్‌ నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ పై ప్రజల్లో అవేర్నెస్‌ కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి ఆశ వాలంటీర్స్‌ కు సూచించారు. అన్ని జాతీయ కార్యక్రమాల్లో మంచిగా సేవలందిస్తున్న ఆశావాలంటీర్లను అభినందించారు ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ శ్రీనివాసరావు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సుధాకర్‌ రావు, హెల్త్‌ సూపర్వైజర్లు రమా, సతీష్‌ బాబు, ఫార్మసీ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ సీసీలు రామకష్ణారెడ్డి, సందీప్‌ వైద్య సిబ్బంది ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు

➡️