డయేరియాపై అప్రమత్తంగా ఉండాలి -డిఎంహెచ్‌ఒ నాగరాజు

ప్రజాశక్తి-కాశినాయన గ్రామాలలో డయేరియా కేసులపై అప్రమత్తంగా ఉండాలని, వాటిని గుర్తించి వెంటనే నివేదిక పంపాలని డిఎంహెచ్‌ఒ నాగరాజు పేర్కొన్నారు మంగళవారం ఆయన మండల కేంద్రమైన నరసాపురంలోని ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రికార్డులు అన్ని పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం ఆయన ఆశాల సమావేశంలో పాల్గొన్నారు గ్రామాలలోని ప్రతి గర్భిణిని రిజిస్టర్‌ చేయాలన్నారు. బిసిజి వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఒ రమేష్‌రెడ్డి, ఎఎంఒ వెంకటరెడ్డి, మండల వైద్యాధికారి ప్రశాంతి, సూపర్‌వైజర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కలసపాడు : సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి నాగరాజు తెలిపారు. మంగళవారం కలసపాడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించి వారికి తగిన సూచనలు ఇచ్చారు . క్షయ వ్యాధి రాకుండా పెద్దలకు ఇచ్చే బిసిజి ఇంజక్షన్లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అందరూ కష్టపడి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని అన్నారు.

➡️