ప్రజాశక్తి-నెల్లిమర్ల : జరజాపుపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్, కొండవెలగాడ, మొయిద పిహెచ్‌సిలను శుక్రవారం డిఎంహెచ్‌ఒ జీవనరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై ఆమె ఆరాతీశారు. కొండవెలగాడ పిహెచ్‌సికి వచ్చిన గర్భిణులతో మాట్లాడారు. హైరిస్క్ గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం మందుల నిల్వ గదిని పరీశీలించి యువిన్ పోర్టల్‌ను, ఇహెచ్‌ఆర్, టెంపరేచర్ రిజిస్టర్, ఇ-ఔషది యాప్‌లపై దృష్టి పెట్టాలని ఫార్మాసిస్ట్‌ను ఆదేశించారు. పిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్‌కి ఎర్లీ రిజిస్ట్రేషన్, 100 డేస్ టీబీ కార్యక్రమం, ఎన్‌సిడిసిడి 3.0, ఆర్‌బిఎస్‌కె కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిహెచ్‌హెచ్‌ఒ, సిసి ఎస్.సూరి అప్పారావు, అనిల్ ప్రేమ్‌కుమార్, వైద్యాధికారులు వై.ధనంజరు, పి.వి.శిరీష, సిబ్బంది పాల్గొన్నారు.