పిహెచ్‌సిని సందర్శించిన డిఎంహెచ్‌ఒ

Apr 15,2025 21:14

 ప్రజాశక్తి- మెరకముడిదాం : మండలంలోని మెరకముడిదాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలోని సిబ్బందికి సంబందించిన హాజరు పట్టిక, ఒపి రికార్థులను పరిశీలించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎన్‌సిడిసిడి ఆర్‌బికె (రాస్ట్రీయ బాలల సురక్ష కార్యక్రమం ) పిఎంజెవై, బిహెచ్‌ఎ మొదలు సర్వే కార్యక్రమాలు అన్నిటిని, 104 సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి నెలా ప్రభుత్వ హాస్పిటల్‌లో ఐదు నుండి పది వరకు ఉచితంగా డెలివరీలను నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు సీజనల్‌ వ్యాధుల పైన, వడ దెబ్బపైన ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యాధికారి అజిత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️