ప్రజాశక్తి-సీతానగరం : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.భాస్కరరావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌సిసిడి, లెప్రసీ సర్వేలు వేగవంతం చేయాలన్నారు. ఆసుపత్రి రికార్డులను తనిఖీలు చేశారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి పి.ఉషారాణి, హెచ్‌విడి సత్యవతి, సిఇఒ వెంకటరావు, సూపర్వైజర్ శర్మ, యుడిసి మురళి తదితరులు పాల్గొన్నారు.
