కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలి

Feb 4,2025 00:59

నిరసన తెలియజేస్తున్న మృతుని కుటుంబీకులు, సిఐటియు
ప్రజాశక్తి-గుంటూరు :
ఆర్టీసీ కాలనీలో గత నెల 19న ప్రమాదవ శాత్తూ మరణించిన పెయింట్‌ వర్కర్‌ బురుదగుట్ల ప్రేమ్‌కుమార్‌ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ కాలనీ 4వ లైనులో మోజాల నరేష్‌ ఇంట్లో పెయింట్‌ పనులు చేస్తుండగా ప్రేమ్‌కుమార్‌ ప్రమాదవ శాత్తూ కిందపడి, తలకు బలమైన గాయమై ందని చెప్పారు. జిజిహెచ్‌లో చికిత్స పొందు తున్న ఆయన 22వ తేదీన మృతి చెందాడని, ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారని చెప్పారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని బిల్డింగ్‌ యజమానిని, పెయింట్‌ మేస్త్రీ మురళి, కాంట్రాక్ట్‌ ఇంజినీరు మార్కండేయుల్ని ఎన్నిసా ర్లు అడిగినా పట్టించుకోవట్లేదని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.ఖాసింవలి, తూర్పు కమిటీ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి దీవెనరావు, పశ్చిమ కమిటీ అధ్యక్షులు దొడ్డ కోటేశ్వరావు, సిఐటియు నాయకులు ఐ.బాబురావు, సాగర్‌, ఎం.ఝాన్సీ రాణి, బి.జయప్రద, కె.విజయమ్మ పాల్గొన్నారు.

➡️