సిఎం ప్రమాణస్వీకార సభా ప్రాంగణంలోకి ఎలాంటి వస్తువులు తేవద్దు : జిల్లా ఎస్పీ

Jun 11,2024 12:04

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : గన్నవరం మండలం కేసరపల్లి ఐటి పార్క్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో … ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే ప్రజలు, అభిమానులు, వారి బ్యాగులు, ఇతర లగేజీలను వారు ప్రయాణం చేసి వచ్చిన వాహనాలలోనే భద్రపరచుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల భద్రత దృష్ట్యా కార్యక్రమానికి హాజరయ్యే ప్రజానీకం సభా ప్రాంగణంలోనికి వారి వెంట ఎలాంటి వస్తువులు తీసుకురాకూడదని చెప్పారు. పోలీసువారి ఆదేశాలను ప్రజలు పాటించి సహకరించగలరని విజ్ఞప్తి చేశారు.

➡️