మా పొట్ట కొట్టొద్దు : ఆటో కార్మికుల ధర్నా

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ‘ మా పొట్ట కొట్టొద్దు ‘ అంటూ .. విజయనగరంలోని ఆటో కార్మికులంతా సోమవారం ధర్నా నిర్వహించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలాదిమంది ఆటో డ్రైవర్లు పొట్టలు కొడుతున్న రాఫిడ్‌ బైక్స్‌, ఓలా, ఓభర్‌ వంటి కంపెనీలతో జిల్లాలో రైల్వే స్టేషన్‌ లు, బస్‌ స్టాండు కు వద్ద లైసెన్స్‌ లు ఇవ్వడాన్ని విరమించుకోవాలని శ్రీ విజయదుర్గ ఆటో యూనియన్‌ (ఎ. ఐ ఎఫ్‌ టి యు ) నాయకులు బెహరా శంకరరావు,రెడ్డి నారాయణరావు, అప్పలరాజు లు డిమాండ్‌ చేశారు.సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ … రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్ను ఎ.టి.యస్ల ద్వారా ఫిట్నెస్‌ సర్టిఫికేటు జారీ చేసే విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. విజయనగరం జిల్లాలో ఉన్న పరిశ్రమలు మూతబడ్డాయని, కొత్త పరిశ్రమలు లేవు అని చెప్పారు. రాష్ట్రంలో విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లాగా గుర్తింపు ఉన్న విషయం అందరికి తెలిసినదేనన్నారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లేక స్వయం ఉపాధిగా ఆటో రంగాన్ని ఎంచుకొని, పైనాన్సులు లేక ప్రైవేటు వ్యక్తులు వద్ద నుండి అప్పులు చేసి ఆటోలని నడుపుకుంటున్నామన్నారు. ఒక ప్రక్క పెట్రోల్‌, డీజల్‌, స్పేర్‌ పార్టులు ధరలు పెరిగిపోతుంటే మరో ప్రక్క ఇ.చలానాలు పేరుతో ఆర్‌.టి.ఓ., పోలీ, వేల రూపాయిలు ఫైన్లు విధిస్తున్నారని అన్నారు. ఆటో నడుపుకుంటూ పిల్లలను చదివించలేక చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక వైద్య ఖర్చులు కోసం అనేక ఆర్థిక ఇబ్బందులకు గురికాబడుతున్న సమయంలో మూలిగే నక్కమీద తాటి పండు పడ్డచందంగా రాపిడో, బైక్సు, ఓలా, ఓబర్‌ లాంటి బహుళజాతి కంపెనీల పేరుతో ప్రవేశపెట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి నిలుపుదల చేయాలని కోరుతున్నామన్నారు. ఈ ధర్నా లో ఆటో కార్మికులు పాల్గొన్నారు.

➡️