ఆల్కలిన్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించబోమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రైతులు సుముఖంగా ఉంటే రిలయన్స్ కంపెనీ సీబీజీ (బయో గ్యాస్) ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతామన్నారు. ఫణిదంలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్‌లో కన్నా రంగయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.1.30 కోట్లతో నిర్మించిన ఆల్కలీన్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే కన్నా లకీëనారాయణతో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రులు, పాఠశాలలు, హాస్టల్స్ ఇలా చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందన్నారు. త్వరలోనే తన సొంత ఖర్చుతో మరికొన్ని వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని చెప్పారు. వెనకబడిన పల్నాడు ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రిలయన్స్ కంపెనీతో సిఎం చంద్రబాబు చర్చల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 500 సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు కాబోతున్నాయని, ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి, దర్శి, మార్కాపురం వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి వల్ల రైతులకు ఆర్థిక చేయూతతోపాటు, యువతకు ఉద్యోగాలు వస్తాయని, సత్తెనపల్లి ప్రాంతంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, ఆస్పత్రుల్లో తాగునీటి ఇబ్బందులు చూసి ఆల్కలీన్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన వచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పక్కాగా అందించడంలో భాగంగా విద్యార్థుల సంఖ్యను బట్టి స్టీల్ క్యాన్‌లను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు కూడా తక్కువ ధరకు అందిస్తామన్నారు. క్రమంగా నియోజకవర్గ అంతా ఈ సేవలను విస్తరిస్తామన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్‌డిఒ జి.రమాకాంతరెడ్డి, గుంటూరు మాజీ మేయర్ కన్నా నాగరాజు, కూటమి పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ముప్పాళ్ల మండల కేంద్రంలో రూ.50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, నర్సారావుపేట, సతైనపల్లి రోడ్డులో రూ.1.20 కోట్లతో కెనాల్ బ్రిడ్జికి మంత్రి శంకుస్థాపన చేశారు. కు శంకుస్థాపన చేశారు. నాయకులు బి.నాగేశ్వరరావు, ఆర్.దేవేంద్రరావు, జి.కోటేశ్వరరావు, ఆర్.మధుబాబు, ఎస్.వెంకట్రావు, ఎస్.గోపాలరావు పాల్గొన్నారు.