స్టీల్‌ప్లాంట్ అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ధర్నా
ప్రజాశక్తి -ఉక్కునగరం :స్టీల్ కాంట్రాక్టు కార్మికుల తొలగింపును తక్షణం ఆపకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. సోమవారం కోక్ ఓవెన్ ఆర్‌ఎంహెచ్‌పి. టిపిపి సింటర్ ప్లాంట్ హెచ్‌ఒడి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ ఎవ్వరినీ తొలగించబోమని అక్టోబరు 2న ఆర్‌ఎల్‌సి సమక్షంలో అంగీకరించి, ఇప్పుడు దొడ్డిదారిన కాంట్రాక్టు కార్మికులను తొలగించే యత్నాలు చేస్తున్నారన్నారు. కాంట్రాక్టు కార్మికుల ఉపాధి జోలికి రావద్దని, స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తే దానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఆయా విభాగాధిపతులకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నమ్మి రమణ, జి శ్రీనివాసరావు, మంత్రి రవి, కోన రమణ, ఉమ్మడి అప్పారావు, యు సోమేష్, పి మసేను, సోంబాబు, శశిభూషణ్, నాగరాజు, కోన అప్పారావు, మంగరాజు, పితాని భాస్కరరావు పాల్గొన్నారు
ధర్నా చేస్తున్న ఉక్కు కాంట్రాక్టు కార్మికులు