పనోరమా హిల్స్‌లో వైద్యుల ఇంట్లో చోరీ

పనోరమా హిల్స్‌లో వైద్యుల ఇంట్లో చోరీ

ప్రజాశక్తి -మధురవాడ: కట్టుదిట్టమైన భద్రత, సిసి కెమెరాల నిఘా, అన్ని ద్వారాల వద్ద సెక్యూరిటీతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న పనోరమా హిల్స్‌లో దొంగతనం జరగడంతో కాలనీవాసులు అవాక్కయ్యారు. మధురవాడలో పనోరమా హిల్స్‌లో గురువారం రాత్రి ఓ విల్లాలో చోరీ జరిగింది. నేరా విభాగ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పనోరమా హిల్స్‌ లో 43ఏ నెంబర్‌ గల విల్లాలో కె.వెంకటేశ్వరరావు, సంధ్యాదేవి వైద్యదంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు భీమవరంలో ఉన్న వారి బంధువు మృతి చెందడంతో ఇంటికి తాళాలు వేసి అక్కడకి వెళ్లారు. అదే రాత్రి దొంగలు ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న తాళం విరగ్గొట్టి , ఇంట్లో ఉన్న సుమారు 25 తులాల బంగారం వస్తువులు, రూ 10 లక్షల నగదు చోరీ చేసినట్లు బాధితులు సంధ్యాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పీఎం పాలెం నేరా విభాగం పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీం సాయంతో ఆధారాలను సేకరించారు. కాలనీలో ఉన్న సిసి టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు ఎస్సై రంభ శ్రీనివాసరావు తెలిపారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

వివరాలను సేకరిస్తున్న పోలీసులు

➡️