విశాఖ : కొల్‌కతాలో వైద్య విద్యార్థిని పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ముక్తకంఠంతో ఖండిస్తూ …. శుక్రవారం బీచ్ రోడ్ల లో డాక్టర్ లు ర్యాలీ చేపట్టారు. జిల్లా అధ్యక్షులు పివి.సుధాకర్ సమక్షంలో డాక్టర్లంతా తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి మాట్లాడుతూ …. డాక్టర్ వఅత్తి చాలా సున్నితమైనదని అయినప్పటికి ఇంత పెద్ద సంఖ్యలో డాక్టర్లు పాల్గన్నారంటే సమస్య ఎంత జటిలమైనదో అర్థమవుతోందని అన్నారు. డాక్టర్ ల పైన అనేక దాడులు జరుగుతున్నాయని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి వారికి రక్షణ కల్పించాలని, చట్టాలు అమలు చేయాలని కోరారు. డాక్టర్లు చేసిన ప్రతి ఉద్యమం వెనుక మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఉంటుంది అని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు రాజేష్ , స్రవంతి, రాష్ట్ర నాయకులు సంజరు, మహిళా మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఇతర నాయకులు, పెద్ద సంఖ్యలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు.
వైద్య విద్యార్థిని పై దాడిని ఖండిస్తూ … డాక్టర్ల ర్యాలీ
