ప్రజాశక్తి- కలకడ (రాయచోటి-అన్నమయ్య) : క్యాన్సర్ వ్యాధి పట్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులు మల్లికార్జున, కిషోర్ కుమార్ రెడ్డి లు తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన కలకడ, పాపి రెడ్డి గారి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించిన ఆశాడే సందర్భంగా ఆశ వర్కర్లకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించినట్లు తెలిపారు.ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.మండలంలోని గ్రామాల్లో ఎన్సీడీ, సిడి సంబంధించి మూడు పర్యాయాలు గ్రామీణ ప్రాంతాలుగా అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు.మండలంలో ఉన్న క్యాన్సర్ బాధితులు 18 సంవత్సరాల నుండి పైబడిన వారికి క్యాన్సర్ పై స్కీనింగ్ చేయించడం దీనితో వచ్చే లాభాలను ప్రజలకు తెలియజేయడం కోసం ఆశాలకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం క్యాన్సర్ వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించాలంటూ ఆశాలు వైద్య సిబ్బంది కలసి ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మోహన్, జోహార్ బాబు, హెల్త్ సూపర్వైజర్ రామకృష్ణమ్మ ,వెంకటేశ్వరరావు ,ఎంపీహెచ్వో జయరామయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ రాజమ్మ, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్ పాల్గొన్నారు.
