తల్లి అంగవైకల్యం, మూగ – బాబు పై కుక్క దాడి

May 10,2025 15:46 #Dog attacks, #mother, #mute son

ప్రజాశక్తి- యల్లనూరు (అనంతపురం) : స్థానిక మండల కేంద్రంలో రెండేళ్ల బాబు పై శుక్రవారం రాత్రి కుక్క దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు స్థానిక మండల కేంద్రం పాతపేట రజక వీధిలో నివాసం ఉంటున్న కొప్పేల నాగమ్మ భర్త కొప్పేల గురుస్వామి దంపతుల కుమారుడు గురు ప్రజ్వల్‌ 2 సంవత్సరాలు. తల్లి పుట్టుకతో అంగవైకల్యం మూగ. బాబుకి తల్లి ఆహారం ఇస్తుండగా వారి ఇంటి సమీపంలో ఉన్న కుక్క అకస్మాత్తుగ వచ్చి బాబును నోటికి కరిపించుకొని ఎత్తు కెళ్ళి తీవ్రంగా గాయపరిచింది. తల్లి మూగ అంగవైకల్యం కావడంతో ఆమె కళ్ల ముందే దారుణం జరిగింది. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక పక్కన ఆదివారం కేశ ఖండన కార్యక్రమం నేపథ్యంలో బాలునికి ఇలా జరగడం చాలా అమానుషం అంటూ బంధువులు రోదించారు.

➡️