ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి విరాళం

ప్రజాశక్తి-కనిగిరి : హనుమంతునిపాడు మండలం, ఉమ్మనపల్లి గ్రామ పంచాయతీ, కొత్తూరు గ్రామానికి చెందిన టిడిపి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి మువ్వా రంగసాయి యాదవ్‌, మువ్వా రంగ, నందనవనం మాజీ ఎంపీటీసీ పెన్నా గురవయ్య కలిసి ఆర్‌అండ్‌డి ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరపున ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కోసం రూ.50 వేల నగదును శనివారం కనిగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ వైద్యశాల అభివృద్ధి కోసం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ముందుకొచ్చి సాయం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, గాయం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️