ప్రజాశక్తి – వేటపాలెం : మండల పరిధిలోని దేవాంగపురిలో నిర్మిస్తున్న దేవాంగ భవన్‌కు బట్ట మోహన్‌రావు పుష్పవల్లి చారిటబుల్ ట్రస్ట్ తరపున రెండు లక్షల రూపా యల విరాళాన్ని మంగళవారం అంద జేశారు. దేవాంగపురిలోని శివాల యంలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రస్ట్ అధినేతలు బట్ట మోహన్ రావు, పుష్పవల్లీ, జ్యోతిర్మయి దేవాంగ సమితి వారికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బట్ట మోహన్‌రావు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా మంగళ, శనివారాల్లో పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు చదువుకు నేందుకు చేయూత నందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు ప్రొఫెసర్ రవిబాబు, శేఖర్, బీరక పరమేష్, సజ్జశ్రీనివాసరావు, నాసిక కోటేశ్వరరావు,గుత్తి పరంజ్యోతి, పుట్టమరాజు సీతారామయ్య, రోహిణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
