రూ.2వేల విరాళం అందజేత

ప్రజాశక్తి – పంగులూరు : విజయవాడలో నిర్మిస్తున్న ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి సీనియర్‌ కళాకారుడు నందవరపు జాన్‌ సాహెబ్‌ రూ.2 వేల విరాళాన్ని అందజేశారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అనీల్‌ కుమార్‌కు గురువారం ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జాన్‌ సాహెబ్‌ మాట్లాడుతూ తాను కళాకారుడిగా ఎదగటానికి ప్రజానాట్యమండలి ఎంతగానో సహకరి ంచినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చే విధంగా ప్రజానాట్యమండలిలో తాను పనిచేసినట్లు తెలిపారు. అనేక మంది కళాకారులను తాను తయారు చేసినట్లు తెలిపారు. ప్రజానాట్యమండలి అభివద్ధి చెందితే కళారూపాల ద్వారా ప్రజలకు సమస్యలను వివరించవచ్చని తెలిపారు. రాష్ట్ర కార్యాలయ నిర్మాణంలో తాను ఒకడిగా నిలవాలన్నదే తన కోరికని తెలిపారు. పేదరికంలో ఉండి కూడా రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి ఓ కళాకారుడిగా విరాళం అందజేసిన జాన్‌ సాహెబ్‌ను అనీల్‌ కుమార్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌.గంగయ్య, సీని యర్‌ నాయకులు రాయని వినోద్‌ బాబు అభినందించారు.

➡️