కేసులకు భయపడం

Jan 7,2025 23:47

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అడ్డగోలు అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో వైసిపి కార్యకర్తల చర్యలనూ తాము నియమత్రించలేమని వ్యాఖ్యానించారు. స్థానిక సబ్‌ జైలులో ఉన్న వైసిపి కార్యకర్తలను మంగళవారం పరామర్శించిన ఆయన మాట్లాడుతూ రొంపిచర్ల మండలం కొత్తపల్లి సర్పంచ్‌, వైసిపి నాయకులు గంటా కోటేశ్వరరావు, ఆయన సోదరులు కొండలు, చిన్న కోటేశ్వరరావుపై టిడిపి నాయకులు అక్రమ కేసులు బనాయించిన కారణంగా వారు రిమాండ్‌లో ఉన్నారన్నారు. క్రిస్మస్‌ పండుగ, నూతన సంవత్సరం సందర్భంగా చర్చీలో జరిగే ప్రార్థనలకు వైసిపికి చెందిన 35 కుటుంబాలు వెళ్లకుండా టిడిపికి చెందిన వారు అడ్డుకున్నారన్నారు. రొంపిచర్ల పోలీసులు జోక్యం చేసుకొని వైసిపికి చెందినవారు కూడా ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం కల్పించినా టిడిపికి చెందినవారు అడ్డుకున్నా రన్నారు. ఆ రోజు జరిగిన చిన్న గొడవను ఆధారం చేసుకుని 324 కేసు నమోదు చేశారని, దాన్ని 326 సెక్షన్‌గా మార్పు చేసి సర్పంచ్‌, అతని ఇద్దరు సోదరులను అరెస్టు చేశారని అన్నారు. వచ్చే నెలలో తమ అధినేత జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలకు వచ్చి కార్యకర్తలకు భరోసా కల్పిస్తారని అన్నారు. ఎమ్మెల్యే వెంట ఐ.రంగారెడ్డి, ఎం.వెంకటేశ్వరరెడ్డి, డి.పెదసాంబిరెడ్డి, పి.హనిమిరెడ్డి ఉన్నారు.

➡️