అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు : మైలవరం శాసనసభ్యుని కార్యాలయం

మైలవరం (ఎన్టీఆర్‌ జిల్లా) : తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్‌ని నియమించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని మైలవరం శాసనసభ్యుని వారి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. కొందరు సామాజిక మాధ్యమాల్లో పదే పదే ఇష్టానుసారంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుని తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇంఛార్జిగా నియమించినట్లు పోస్టు చేస్తున్నారని, ఇందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఇకపై ఎవరూ ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని మైలవరం ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

➡️