ప్రజాశక్తి-డోన్ (నంద్యాల) : మూఢనమ్మకాలను నమ్మవద్దని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతమ్మ, సీనియర్ ఉపాధ్యాయులు వెంకటసుబ్బారెడ్డి లు అన్నారు. బుధవారం డోన్ పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేట వద్ద 8,9,10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చెకుముకి టాలెంట్ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పద్మావతమ్మ, సీనియర్ ఉపాధ్యాయులు వెంకటసుబ్బారెడ్డి లు మాట్లాడుతూ … మూఢనమ్మకాలను నమ్మరాదని, ప్రతి ఒక్కరూ గుర్తించి శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. సైద్ధాంతిక మరియు భౌతిక, విజ్ఞాన శాస్త్ర అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళితే మానవ జీవితం సుఖమయం అవుతుందన్నారు. సామాజిక పురోగతి జరగాలంటే సైన్స్ పట్ల నమ్మకం ఉండాలన్నారు. అలాగే పాఠశాల పరిసరాలను టబ్యాకో ఫ్రీ జోన్ గా ప్రకటించారు. విద్యార్థులు ఎవ్వరు కూడా పొగాకు ఉత్పత్తులను వాడటం నేరమని, వాటి వాడకం వల్ల ఆరోగ్యం పాడవుతుందని, కాలేయం దెబ్బతినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మందగించి, రోగాలు పాలవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు వెంకటరమణ, రఘునాథ్, ఎస్తేరమ్మ, సుబ్బారాయుడు, రమేష్, బాబు, సంజీవరెడ్డి, శ్రీనివాసులు, లక్ష్మయ్య, లక్ష్మి కాంతరెడ్డి, రాధ, అల్లిపీరా, మద్దిలేటి, విజయకుమార్, సుబాన్, జయసుబ్బారాయుడు, శివన్న, ఆదినారాయణ, సురేష్, మధుసూదన్ రెడ్డి, లీలావతమ్మ, దేవేంద్రప్ప, భానుప్రకాష్ రెడ్డి, భారతి, లక్ష్మీ ప్రభావతి, హుస్సేన్ భాను, రవీంద్ర నాథ్ శర్మ, మహేష్, అల్లిపీరా, తదితరులు పాల్గొన్నారు.
