ఐశ్వర్య డెవలపర్స్‌ పై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు : సంస్థ అధినేత ఇందల దివ్య

ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : ఐశ్వర్య ప్రమోటర్లు, డెవలపర్స్‌ సంస్థ పై కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని సంస్థ అధినేత దివ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం విశాఖలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ … ఐశ్వర్య సంస్థను 2022లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెండేళ్లల్లో భోగాపురం, ఆనందపురం, తగరపువలస, అచ్యుతపురంలో వెంచర్స్‌ ను వేయడం జరిగిందన్నారు. సంస్థ అభివఅద్ధి చూడలేక కొంతమంది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. చెరుకూరి రాంజి అనే వ్యక్తి రెండేళ్ల క్రితం తమ సంస్థలో మార్కెటింగ్‌ విభాగంలో చేరారని ఇక్కడ చేరక ముందు అతను వేరే సంస్థ లో పనిచేస్తున్న సమయంలో ఆ సంస్థ పూసపాటి రేగ లో వేసిన వెంచర్‌ కు సంబంధించి కస్టమర్స్‌ తో వివాదాలు ఉన్నాయని తెలిపారు. తమ సంస్థలో రాంజీ వున్నారన్న విషయం తెలుసుకొని ఆ సంస్థలో ప్లాట్‌ లు కొన్నవారు ఇక్కడకు వచ్చారని , పూసపాటి రేగ వెంచర్‌ కు తమ సంస్థ కు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. సదరు వ్యక్తి ని తమ సంస్థ నుంచి తొలగించడం జరిగిందన్నారు. ఒక మహిళగా కింద స్థాయి నుంచి ఈ స్థాయి కి చేరుకున్నానని, తమ అభివఅద్ధిని చూడలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈ ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు.

➡️