మరి అప్పగించరా..?

Apr 17,2024 21:56

హుదూద్‌ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించని ప్రభుత్వం

ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన గృహ సముదాయం

నిరుపయోగంగా మారిన 32 ఇళ్లు

రూ.1.27 కోట్లు ప్రజా ధనం వృథా

ప్రజాశక్తి – భోగాపురం : పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన హుద్‌ హుద్‌ గృహాలు అప్పట్లో పంపిణీ చేయలేదు. అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం కూడా వీటిని పట్టించుకోలేదు. దీంతో ఈ గృహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. సుమా రు రూ.1.27కోట్లు వృధా అయ్యావని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఈ గృహాలు ఆసాంఘిక కార్యాకలాపాలకు నిలయంగా మారాయి. టిడిపి హయాంలో కంచేరు సమీపంలోని దిబ్బలపాలెం వెళ్లే రహదారిలో రూ.1.27కోట్లతో 32 హుద్‌హుద్‌ గృహాలను నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు 2019 ఫిబ్రవరిలో వీటిని ప్రారంభించారు. కాని లబ్దిదారులకు మాత్రం అప్పజెప్పలేదు. ఆ తరువాత వైసిపి ప్రభుత్వం అధికారలంలోకి వచ్చింది. వీరుకూడా వీటి గురించి పటించుకోలేదు. దీంతో ఆ ప్రాంతంలోని కొంత మంది ఆకతాయిలకు ఆసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. అంతేకాక ఈ గృహాలు ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా మిగిలిపోయావని పలువురు విమర్శిస్తున్నారు. నాయకులు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

➡️