వలసలు వెళ్ళకండి.. ఉపాధి పనులు కల్పిస్తాం : టిడిపి సీనియర్ నాయకులు ఉల్లిగయ్య

Dec 9,2024 17:57 #Kurnool

ప్రజాశక్తి – కౌతాళం : వలసలు వెళ్ళకండి.. తమ సొంత గ్రామాల్లోని కూటమి ప్రభుత్వం ఉపాధి పనులు కల్పిస్తుందని టిడిపి సీనియర్ నాయకులు ఉల్లిగయ్య, టిడిపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం వల్లూరు గ్రామంలో ఉపాధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉండాలని, పిల్లల చదువు కూడా అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఉపాధి హామీ పనులు కూటమి ప్రభుత్వం చేపట్టిందని వారన్నారు. రోజు వారి వేతనం కూడా తగిన డబ్బు చెల్లిస్తుందని తెలియజేశారు. బెంగళూరు, గుంటూరు, తెలంగాణ తదితర ప్రాంతాలకు వలస వెళ్లి అనారోగ్యానికి గురి అవుతున్నారు అన్నారు. సొంత గ్రామాల్లోని ఉపాధి పనులు చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమములో ఎపిఓ మధవశంకర్, టిఎ సుధాకర్, ఎఫ్ఏ అధిబసవ మొదలగు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️