ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి
ప్రజాశక్తి-.అనకాపల్లి : విద్య,వైద్యాన్ని ప్రయివేటుపరం చేయొద్దని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి. జాన్సన్ బాబు, కే.శివారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక రోటరీ క్లబ్‌లో యూనియన్ ప్రధమ జిల్లా మహాసభ రెండవ రోజున జిల్లా అధ్యక్షులు బి.బాబ్జి అధ్యక్షతన ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు హాస్టల్ సమస్యలపై జూన్ నెల నుంచి పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఏఐఎస్‌ఎఫ్ మాజీ నాయకులు బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రయివేటుపరం చేస్తుంటే స్థానిక నేతలు, రాష్ట్ర ప్రభుత్వం కళ్లప్పగించి చూడడం రాష్ట్ర ప్రజలు, యువతను మోసం చేయడమేనన్నారు. అనకాపల్లి ప్రధమ మహాసభ బహిరంగ సభ వేదికగా ఉద్యోగం, ఉపాధికి విద్యార్థులందరూ పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా నూతన కమిటీ ఎన్నిక
ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కమిటీ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా బి.బాబ్జి, జీ.ఫణీంద్ర కుమార్ ఎన్నిక కాగా 31 మంది జిల్లా కమిటీ సభ్యులుగా, 9 మందిని ఆఫీస్ బేవర్స్‌గా ఎన్నుకున్నారు. మహాసభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్, నాగభూషణం, రాజన్న దొరబాబు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి