ఇంటింటికి విద్య మన బాధ్యత – చల్లపల్లిలో ఉపాధ్యాయుల ర్యాలీ

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : ఇంటింటికి విద్య మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా … మంగళవారం స్థానిక నారాయణరావు నగర్‌ లో ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాల మన పాఠశాల మన పాఠశాల లోనే నాణ్యమైన విద్యను అందిస్తాము – మీ పిల్లలను చేర్పించండి అని ఉద్యోగ తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారు. చల్లపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని ఎంపీపీ స్కూల్‌ నారాయణ రావు నగర్‌ ఉపాధ్యాయులు వీధులలో తిరుగుతూ 2024-2025 విద్యా సంవత్సరానికి బడి ఈడు గల బాల బాలికలను బడిలో చేర్పించండి అని బాల బాలికల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బిడ్డలు పనిలో కాదు బడిలో ఉండాలని ప్రచారం చేస్తున్నారు. పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి స్పెషల్‌ డ్రైవ్‌ ను ప్రారంభించిన ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కైతే పల్లి దాస్‌ పాఠశాల కమిటీ చైర్మన్‌, అంగన్వాడీ కార్యకర్త, పేరెంట్స్‌ తో కలిసి నారాయణరావు నగర్‌ పురవీధుల తిరుగుతూ అందరికీ విద్య ప్రాధాన్యత ను వివరించారు. నూతనంగా తొమ్మిది మంది పిల్లలను పాఠశాలలో చేర్పించారు. ఈ కార్యక్రమానికి చనర కుమారి, విజయ దుర్గ రాధారాణి, దుర్గా ప్రసాద్‌, అంగన్వాడీ కార్యకర్త ముంతాజ్‌ బేగం,పిసి చైర్మన్‌ రాధ పేరెంట్స్‌ పాల్గొన్నారు.

➡️