వైసీపీ రాష్ట్ర ఇంటలెక్చువల్‌ ఫోరం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ అశోక్‌కుమార్‌రెడ్డి

ప్రజాశక్తి-శింగరాయకొండ: వైసీపీ రాష్ట్ర ఇంటలెక్చవల్‌ ఫోరం ప్రధాన కార్యదర్శిగా శింగరాయకొండకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ బత్తుల అశోక్‌ కుమార్‌ రెడ్డి నియమతులయ్యారు. ఆయ నను మంగళవారం మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అశోక్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్‌ రెడ్డికి, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌కి, జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ బూచేపల్లి శివ ప్రసాద్‌ రెడ్డికి, ఒంగోలు పార్లమెంటు ఇంచార్జి డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి, రాజ్యసభ సభ్యులు వై.వి సుబ్బారెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకష్ణారెడ్డికి, రాష్ట్ర ఇంటలెక్చువల్‌ ఫోరం అధ్యక్షులు వై.ఈశ్వర్‌ ప్రసాద్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

➡️