ఆర్సీపురంలో ఘనంగా డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 134వ జయంతి వేడుకలు

ప్రజాశక్తి-రామచంద్రపురం (తిరుపతి) : భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యులు, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కఅషి చేయాలని ట్రైనీ ఐపీఎస్‌ బడ్డు హేమంత్‌ కోరారు. సోమవారం ఆర్‌ సి పురం లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో, పోలీస్‌ స్టేషన్లో, 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణంలో ఎస్‌ హెచ్‌ ఓ ట్రైనింగ్‌ ఐపీఎస్‌ బడ్డు హేమంత్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్‌ బడ్డుహేమంత్‌ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ప్రజలకు నిస్వార్ధమైన, జవాబుదారితనముతో కూడిన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు ఆదేశాల మేరకు వేసవిలో పక్షుల సంరక్షణ కోసం నీటి కుండలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ లు శేఖర్‌, ఈశ్వర్‌, హెడ్‌ కానిస్టేబులు, మదన్మోహన్‌, పరమేశ్వర్‌ రెడ్డి. వెంకటేష్‌, త్యాగరాజు, సురేష్‌, జి గోపి, రమేష్‌ రాయల్‌, మహేష్‌, రమేష్‌ రెడ్డి దివ్య తదితరులు పాల్గొన్నారు.

➡️