ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయం లో సోమవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఆత్మకూరు సర్పంచ్ ఎగ్గిడి వరలక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజం మార్పు కోసం పేదరిక నిర్మూలన కోసం బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశారు గ్రామీణ ప్రాంతాల్లో అంటరాంతనం కులవేక్ష వ్యతిరేకంగా సమానత్వం వెట్టి చాకిరి విముక్తి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు అయితే ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ విధానాలతో రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా వ్యవహరిస్తుందన్నారు కులాల పేరుతో హిందువులను ముస్లింలను క్రిస్టియన్ల మధ్య చిచ్చు పెడుతూ విడదీసి పాలించే సూత్రాన్ని అవలంబిస్తుందన్నారు అందులో భాగంగానే దళితుల పైన ముస్లిమ్స్ పైన దాడులు కొనసాగిస్తున్నాయన్నారు వారి విధానాలను ఎదుర్కొనాలంటే భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులందరూ సమిష్టిగా ఐకమత్యంతో ఆందోళన పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతఐనా ఉందన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు భవిష్యత్తులో అంటరానితనం కుల వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్కిడి వన్నూరప్ప వెంకటేష్ నాగరాజు పాల్గొన్నారు.
