ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : జూన్ 24 సోమవారం నుంచి ”ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం” ద్వారా ప్రజల నుంచి ”మీకోసం” వేదిక ద్వారా అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో మార్చి నెల నుంచి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నిలుపుదల చేశామని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను ”పబ్లిక్ గ్రివియన్స్ రెడ్రెస్సల్ సిస్టం (పి జి ఆర్ ఎస్)” ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న స్పందన స్థానంలో ” మీకోసం – పి జి అర్ ఎస్ ” ద్వారా ప్రజల నుంచి ప్రతి సోమవారం అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ”పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (%ూ+=ూ%)” అనేది సార్వత్రిక ఫిర్యాదుల పరిష్కార హెల్ప్‌లైన్, ఇది పౌరులు తమ సమస్యను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయడానికి అనుమతిస్తుందని, పౌరులు 1902 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చునని కలెక్టరు తెలియచేశారు. ఇందులో వ్యక్తిగత లేదా గఅహ-స్థాయి ఫిర్యాదులను నమోదు చేయండి, నమోదిత ఫిర్యాదు యొక్క స్థితి గతులు తెలుసుకోవడం, ప్రభుత్వ సేవలు, పథకాల వివరాలు గురించి ఆరా తీయండి వంటి అంశాలను పోర్టల్ లో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ వద్ద, అదేవిధంగా డివిజన్, మునిసిపల్, మండల స్థాయిలో ఆయా ప్రధాన కార్యాలయాల్లో సంబంధిత శాఖల అధికారులు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలియచేశారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లో కలెక్టరు, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, మండల స్థాయి సంబంధిత అధికారులు ఒకే చోట అందుబాటులో ఉండి ప్రజలు నుంచి అర్జీలు స్వీకరిస్తారని మాధవీలత తెలిపారు.హొజిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులుహొ ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా రెవెన్యూ, మునిసిపల్, మండల కేంద్రంలో అర్జీలు అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు అర్జులు స్వీకరించడం జరుగుతుందని, జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉండే అధికారులకి మీ అర్జిలను అందచేయాలని పేర్కొన్నారు.
స్పందన స్థానంలో ”మీకోసం” అర్జిల స్వీకరణ : కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత
