ప్రజాశక్తి- కలకడ (రాయచోటి-అన్నమయ్య) : ప్రపంచ రేబిస్ వ్యతిరేక దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎం.వి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఎర్రకోట పల్లి పి.హెచ్.సి పరిధిలో ఎర్రకోట పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో డాక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యం లో ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన విద్యార్థులు కు ప్రపంచ రేబిస్ వ్యాధి వ్యతిరేక దినోత్సవం పై డాక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి, ఎమ్.పి.హెచ్.ఈ.ఓ.జయరామయ్య లు అవగాహన కల్పించారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచ రేబిస్ దినోత్సవం జరుపుకుంటామని, ఎందుకంటే లూయి పాస్టర్ అను శాత్రవేత్త రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ ను తయారు చేసి అమలులోకి తెచ్చారు. అందుకే ఆయన వర్ధంతి సెప్టెంబర్ 28వ తేదీని ప్రతీ సంవత్సరం ప్రపంచ రేబిస్ దినోత్సవముగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. లిసా అనే వైరస్ వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ కలిగిన కుక్కలు, పిల్లులు, తోడేళ్ళు, నక్కలు, పెద్ద పిచ్చుకలు, ఉడుములు, ముంగిసలు, గబ్బిలాలు కోతులు, ఎలుకలు, వంటి వాటిల్లో వైరస్ లు ఉండి ఈ జంతువులు మనల్ని కరచినపుడు ఈ వ్యాధి వస్తుందని తెలిపారు.
ఘనంగా ప్రపంచ రేబిస్ వ్యతిరేక దినోత్సవం : డాక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి
