ప్రజాశక్తి-చిప్పగిరి (కర్నూలు) : దేశంలో జనాభా నియంత్రణ చాలా అవసరమని, జనాభా పెరగడం వలన చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ పార్వతమ్మ, సిహెచ్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మండల కేంద్రమైన చిప్పగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సిహెచ్‌ఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభా పెరుగుట వలన నిరుద్యోగ సమస్య, భూ సమస్యలు, ఆహార సమస్య, నీటి సమస్య, ధరలు పెరుగుట ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి అన్నారు. జనాభా నియంత్రణకు ప్రస్తుత కాలంలో పురుషులకు వ్యాసక్తిమీ ఆపరేషన్, మహిళలకు ట్యూబేక్టమి లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అందుబాటులో ఉన్నాయన్నారు. మనం ఇద్దరూ మనకి ఇద్దరూ సంతానం ఉంటే సంసారం కూడా చాలా చక్కగా ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించారు. వివాహాలు తప్పనిసరిగా ఆడవారికి 18 సం, మగవారికి 21 సం, తప్పనిసరిగా ఉండాలని చట్టం చెబుతుందన్నారు. సంతానంలో మెలకువలు పాటించి బిడ్డ బిడ్డకు వ్యవధి మూడు సంవత్సరాలు ఉండేలా చూసుకోవాలన్నారు. టీ బి సూపర్వైజర్ గోపాల్, ఫార్మసిస్టు కృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్ సుష్మ, స్టాప్ నర్సు సిబ్బంది పాల్గొన్నారు.
జనాభా నియంత్రణ అవసరం : ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ పార్వతమ్మ, సిహెచ్‌ఓ వెంకటేశ్వర్లు
