డాక్టర్ పుల్లన్న సేవలు మరువలేనివి

Oct 31,2024 16:15 #Kurnool

ప్రజాశక్తి – కర్నూలు జిల్లాపరిషత్ : డాక్టర్ టి పుల్లన్న సేవలు మరువలేనివి కురువ సంఘం నాయకులు పేర్కొన్నారు. గురువారం టిజీవీ కళాక్షేత్రంలో కీర్తిశేషులు డాక్టర్. టీ.పుల్లన్న తృతీయ వర్ధంతి సభ కూతురు శ్రీలీలమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి, బి.వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయ, పాల సుంకన్న, తవుడు శ్రీనివాసులు,బి. రామకృష్ణ,బి. సి.తిరుపాల్, పుల్లన్న, కె. వెంకటరమణ, నాగరాజు, బాలరాజు,, రామకృష్ణ,తదితరులు డాక్టర్ టి.పుల్లన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుడిసె శివన్న, ఎం. కె.రంగస్వామి, శ్రీలీలమ్మ లు మాట్లాడుతూ కురువ కులస్థుల కోసం పుల్లన్న గారు చేసిన సేవలు కోనియాడారు.

➡️